Thursday, September 1, 2011

తాతయ్య

వినాయక చవితి అంటే .. పాలవెల్లి తయారు చెయ్యడం  .. దానికి రక రకాల పండ్లు పసుపు దారం తో కట్టడం ..
ముడి వెయ్యడం రాకపోతే నాన్న .. సహాయం తీసుకోవడం .. ఎక్కడున్నా .. వినాయక చవితి రోజుకి సెలవు పెట్టుకుని ఇంటికి రావడం ..
ఇవన్ని అందరి జీవితం లో జరిగే సంఘటనలే .. సంతోషాలే ..
మాకు కూడా ఇలానే ఉండేది వినాయక చవితి .. కాని ఒక సంఘటన .. తీరని మచ్చగా మిగిలిపోయింది  ..
ఇది పదహారు సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన ..
ఈరోజు లాగానే ఒక వినాయక చవితి రోజు .. నేను అయిదవ క్లాస్ అన్నయ్య .. తొమ్మిది ..
పొద్దున్నే పూజ చేసుకున్నాక .. అమ్మ చేసిన పిండి వంటలు .. ఉండ్రాళ్ళు .. జిల్లెడి కాయలు నైవేద్యం పెట్టింది ..
ఇంక మధ్యానం పన్నెండు అయ్యింది కదా అని బోజనాలకి కూర్చుంటూ ఉండగా .. సుధా అన్నయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు ..
నాన్నని పక్కకి పిలిచి .. ఏదో చెప్పాడు .. వెంటనే నాన్న వచ్చి అందరు భోజనాలు చెయ్యండి .. తొందరగా అని హడావిడి పెట్టసాగారు ..
అమ్మ నాకు అన్నయ్యకి వడ్డించి .. నాన్నని కూడా కూర్చోమని చెప్పింది .. కాని నాన్న .. తినలేదు .. అమ్మ కూడా తినలేదు ..
వెంటనే అందరు బట్టలు సద్దుకుని అప్పటికప్పుడు రాజమండ్రి బయలుదేరాం అక్కడ .. సింహాద్రి ఎక్కి వైజాగ్ .. ఏమయ్యిందో అర్ధం కావడం లేదు .. ఎక్కడకి వెళ్తున్నామో తెలియడం లేదు .. ఎందుకు ఇలా వినాయక చవితి రోజు ఊరు తీసుకెళ్తున్నారు .. సాయంత్రం సినిమా చూద్దామంటే డిస్టర్బ్ చేస్తారు అని మాత్రం ఫీల్ అయ్యా నేను తెలిసి తెలియని తనం తో ..
తర్వాత .. నాన్న అమ్మకి ఏదో చెప్పారు .. అంతే అమ్మ ఏడవడం స్టార్ట్ చేసింది .. నాకేమి అర్ధం కాలేదు .. భయం భయంగా అన్నయ్య పక్కన కూర్చుని చూస్తున్న .. చాలా సేపు పోయాక .. అన్నయ్య చెప్పాడు ..
" చెల్లాయ్ తాతయ్య చచ్చిపోయాడట" ..  నాకు ఏమి అర్ధం కాలేదు .. చచ్చిపోవడం అంటే ఏంటో .. తెలీదు .. అలా అమ్మని చూస్తూ బాధగ కూర్చుని వైజాగ్ చేరాము ..
ఇప్పటికి మేమంతా వినాయక చవితి చేసుకున్న కూడా .. అమ్మ మనసులో ఎక్కడో ఒక బాధ ..
తాతయ్య .. నాకు అంత సరిగ్గా గుర్తు లేదు కాని .. మా అమ్మకి నాన్న ... చనిపోయిన రోజు .. అలాంటిది .. ఈ రోజు అమ్మతో మంచిగా మాటాడాల్సింది  పోయి .. పొద్దున్నే ఫోన్ చేసి .. ఏదో తిక్కలో అమ్మతో గొడవ పెట్టేసుకుని .. పిచ్చి పిచ్చిగా వాగి ఫోన్ పెట్టేసా ..
మళ్ళి ఫోన్ చేసి మంచిగా మాటాడుతా  ..
తాతయ్యా.. నన్ను క్షమించు .. అమ్మని బాధ పెట్టాను ..

2 comments:

kiran said...

హేహేహేహే..కావ్య...మనం మారం...
నువ్వు నేను ఇలా బ్లాగు ముఖంగా వందో సారి అమ్మకు సారీ చెప్పుంటాం .. :)
హ్మ్మం..మాకు ఉగాది కి సమె experience ..కావ్య..

శ్రీ said...
This comment has been removed by the author.